![]() |
![]() |

అగ్నిపరీక్షని దాటుకొని బిగ్ బాస్ సీజన్-9 లోకి వెళ్ళడానికి కంటెస్టెంట్స్ కి ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. టాస్క్ లో మనీష్, దివ్య జోడి గెలిచారు. టాస్క్ జరిగే ముందే అభిజిత్ ఓ మాట చెప్పాడు. ఎవరైనా ఎల్లో కార్డున్న వారు బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తే వారి కార్డు తీసుకుంటానని, ఇదొక మంచి ఛాన్స్ అని అభిజిత్ చెప్పాడు. ఇక టాస్క్ లో మనీష్ బాగా పర్ఫామెన్స్ చేయడంతో తన దగ్గరున్న ఎల్లో కార్డు తీసుకుంటారు జడ్జెస్.
ఇక దివ్యకి ఓటు అప్పీల్ ఛాన్స్ వస్తుంది. వరెస్ట్ పర్ఫామెన్స్ శ్వేతకి ఇస్తారు. ఆల్రెడీ తన దగ్గర ఇప్పటికే ఎల్లో కార్డు ఉంది కాబట్టి తనకి రెడ్ కార్డు ఇస్తారు. దాంతో తను అగ్ని పరీక్ష నుండి ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక ట్విస్ట్ అని నవదీప్ అంటాడు. మనీష్ దగ్గర నుండి తీసుకున్న ఎల్లో కార్డు ఉంది. అది మేమ్ ఇంకొకరికి ఇవ్వాలనుకుంటున్నామని జడ్జెస్ డిసైడ్ అవుతారు. ఇంకొక ఎల్లో కార్డు ప్రసన్నకి ఇస్తారు. ఆల్రెడీ తన దగ్గర ఒక ఎల్లో కార్డు ఉంది కాబట్టి రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేస్తారు.
దాంతో కంటెస్టెంట్స్ మొత్తం ఎమోషనల్ అయ్యారు. జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చి.. నువ్వు చాలా మందికి ఆదర్శం. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్.. నీ స్టోరీ ఏంతో ఆదర్శమనిపించింది.. నిన్ను బిగ్ బాస్ లో చూడాలని గ్రీన్ ఇచ్చి ఇక్కడ వరకు తీసుకొని వచ్చాము కానీ ఇది నీకు సరైన ప్లేస్ కాదని నవదీప్ అంటాడు. దాంతో ప్రసన్న కుమార్ ఎమోషనల్ అవుతాడు. నేను ఒక రియాలిటీ షోకి విన్నర్ అయ్యాను కానీ నువ్వు రియల్ లైఫ్ లో విన్నర్ అయ్యావని అభిజిత్ అంటాడు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతారు. కాసేపటికి ప్రసన్న కుమార్ వెళ్ళిపోతాడు. ఇక నేటి నుండి బిగ్ బాస్ సీజన్-9 మొదలవ్వడానికి రెండు ఎపిసోడ్ లు మాత్రమే ఉన్నాయి. ఈ రెండింటిలో పదమూడు మంది కంటెస్టెంట్స్ నుండి ఏ అయిదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి. ఈ సీజన్ లో ఎవరు కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇస్తారో తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.
![]() |
![]() |